సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, అందాల భామ రాఖి ఖన్నా ప్రధాన పాత్రలలో మారుతి తెరకెక్కించిన చిత్రం “ప్రతి రోజు పండగే”. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నిన్నటితో చిత్ర షూటింగ్ పూర్తైంది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని పూర్తి చేసి డిసెంబర్ 20న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా చిత్రానికి సంబంధించిన సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. కాగా రాశీఖన్నా బర్త్ డే నేడు (నవంబర్ 30). ఆమె పుట్టినరోజుని పురస్కరించుకుని చాలామంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాంకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె నటిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం కథానాయకుడు సాయిధరమ్ తేజ్ కూడా ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాశీఖన్నాతో దిగిన ఓ ఫొటో పోస్ట్ చేసి విష్ చేశాడు. అయితే ఆ ఫొటోకు సాయితేజ్ పెట్టిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ ఫొటోలో సాయితేజ్ చేయిపై రాశీఖన్నా చేయి వేసినట్లు ఉంది. దీంతో ‘‘హ్యాపీ బర్త్ డే రాశీఖన్నా గారు.. ముందు చేయి తీయమ్మా.. మీ ఫ్యాన్స్ అరుస్తున్నారు నా మీద’’ అంటూ సాయితేజ్ క్యాప్షన్ రాశారు. సాయిధరమ్ చేసిన సరదా ట్వీట్‌పై దర్శకుడు మారుతి అంతే సరదాగా స్పందించారు. రాశీఖన్నాపై సాయిధరమ్ తేజ్ చేయి వేసి దిగిన స్టిల్స్‌ను పోస్ట్ చేసి ‘‘ఇక్కడ చేయి వేసింది ఎవరు డార్లింగ్?’’ అని ప్రశ్నించారు. దానికి సాయితేజ్ రిప్లయ్ ఇస్తూ..‘‘మీరు యాక్షన్ చెప్పారు.. నేను వేశాను. అంతే అండి’’ అంటూ ట్వీట్ చేశారు.
Happy birthday @RaashiKhanna ji …..mundhu cheyi theyi amma Mee fans arusthanaru Naa medha #haathnikhalo #cheyithee #solobrathukesobetter 💪🏼💪🏼💪🏼 pic.twitter.com/9e6vbMpm3z
— Sai Dharam Tej (@IamSaiDharamTej) 30 November 2019