telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీహార్‌ : ఆర్జేడీ, బీజేపీ పోటా పోటీ…

ఈ రోజు విడుదలవుతున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠరేపుతున్నాయి… అయితే, ఫలితాల్లో సీన్ మారిపోయింది… అధికార జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీ మధ్యే పోటీ ఉంటుందని భావించినా… అనూహ్యంగా బీజేపీ లీడ్‌లోకి దూసుకొచ్చింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళిని చూస్తే.. ఆధిక్యంలో ఎన్డీయే, మహాగట్‌ బంధన్‌ కూటమి తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఇక బీజేపీ, ఆర్జేడీ మధ్య కూడా ఆధిక్యం దోబూచులాడుతోంది. బీజేపీ 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఆర్జేడీ 65 స్థానాల్లో లీడ్‌లో ఉంది. సీఎం నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ మాత్రం 55కు పరిమితమైంది.. మరోవైపు.. జేడీయూ కూటమి భాగస్వాములైన కాంగ్రెస్‌కు 26, వామపక్షాలు 17 స్థానాల్లో ఆధిర్యంలో ఉన్నారు.. ఇక, ఎల్‌జీపీ 5 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మొదట ఆధిక్యాల్లో ఆర్జేడీ కూటమి అభ్యర్థులు దూసుకెళ్లగా.. క్రమంగా ఇప్పుడు జేడీయూ కూటమి అభ్యర్థులు లీడ్‌లోకి వస్తున్నారు. జేడీయూ కూటమి ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటేసింది.. మరోవైపు.. గెలిచే ఎమ్మెల్యేలు చేజారిపోకుండా.. అన్ని పార్టీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీతో ఎవరితోనైనా కలిసి అధికారం చేపట్టవచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. 

Related posts