ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది సాయి పల్లవి. ఆ తర్వాత విడుదలైన ఎంసిఏ కూడా హిట్ కావడంతో స్టార్ అయిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా అమ్మడు క్రేజ్ మాత్రంతగ్గలేదు. గ్లామర్ షో విషయంలో మరోసారి ఓపెన్ అయిపోయింది ఈ భామ. స్క్రిప్ట్ డిమాండ్ చేసినా హాట్ సన్నివేశాలకు దూరంగా ఉంటానని చెప్పింది. కేవలం అలాంటి హాట్ సీన్స్ ఉన్నాయనే కారణంతోనే ఈ మధ్య సరిలేరు నీకెవ్వరుతో పాటు డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలను వదిలేసుకుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు రియల్ లైఫ్‌లో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది ఈ ముద్దుగుమ్మ.
సాయి పల్లవికి కొన్ని కంపెనీలు యాడ్స్ చేయాలంటూ వచ్చాయి . ఓ ఫేస్ క్రీమ్ సంస్థ ఏకంగా 2 కోట్లు ఆఫర్ చేస్తే కూడా చేయనని చెప్పింది ఈ భామ. అంతేకాదు.. ఆ మధ్య పడిపడి లేచే మనసు నిర్మాత పారితోషికంలో 40 లక్షలు బాకీ ఉండటంతో సినిమా విడుదలైన తర్వాత ఇవ్వాలని చూసాడు. అయితే ఫ్లాప్ కావడంతో వద్దని చెప్పింది ఈ బ్యూటీ. అలాంటి మంచి మనసు సాయి పల్లవి సొంతం. ఎక్కువ సంపాదిస్తే ఏమైనా ఎక్కువ తింటానా. ఎంత సంపాదించినా రాత్రి ఇంటికి వెళ్లి నేను తినేది మూడు చపాతీలే. ఆత్మసంతృప్తితో బతికితే చాలు. తన విలువలు చంపుకుని పని చేయడం నాకు నచ్చదని సంచలన కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో లవ్ స్టోరీ.. రానా దగ్గుబాటితో విరాట పర్వం సినిమాలు చేస్తుంది ఈ హీరోయిన్.