నీ కోసం వెతికి వెతికి ……
ఆలసినవి ఈ కళ్ళు….
కాలం కొవ్వొత్తి లా కరిగిపోతుంది రా…
నీ జ్ఞాపకం లోని మధురం…
నీ కౌగిలి లోని వెచ్చదనం……
నీ ప్రేమ లోని ఆత్మీయత….
నీ చేరువ లోని ఆనందం…….
నీ ఏకాంతం లో పరవశం ……
మరచిపోలేని జ్ఞాపకాలు…..
నీ జతలో ప్రతి క్షణం కొత్తదనం …
ప్రకృతి పచ్చదనం లా…..
నిర్మల ఆకాశం లా…..
చిరుజల్లులు వర్షం లా….
వెన్నెల హాయి లా నను సేద తీర్చే……
ప్రియ నేస్తమా నను కాదనకు…..
నీ రాక కానరాక మనసు….
మౌనం వహించింది !
-జె.పద్మావతి,
ఆదోని.