ఆరెస్సెస్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఐదేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆ పార్టీ కీలక నేత రామ్‌లాల్‌కు అఖిల భారత సంపర్క్ ప్రముఖ్ బాధ్యతలను అప్పగించింది. ఆరెస్సెస్ జాతీయ సమావేశాలు జరుగుతుండగానే ఈ నిర్ణయం వెలువడటం విశేషం.
ఈ బాధ్యతలను అప్పగించడం వెనుక, బీజేపీ చాలా రాష్ట్రాల్లో విస్తరించడానికి ఆయన చేసిన కృషి, సమర్థతలని ఆరెస్సెస్ స్పష్టం చేసింది. ఆరెస్సెస్ ప్రచారక్‌గా ఉన్న సమయంలోనూ ఆయన చాలా కీలకంగా వ్యవహరించేవారు. ప్రస్తుతం రామ్‌లాల్ బీజేపీకి, సంఘ్‌కు సమన్వయకర్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఆయన స్థానంలో తాత్కాలికంగా సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా జి.సతీశ్ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

