వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక వ్యవస్థీకృత నేరస్తుడని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అలాంటి నేరస్తుడిని సమర్థిస్తూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేయడం ఆయన నేర స్వభావాన్ని చాటుతోందని విమర్శించారు.
మహిళలు, దళితులు అంటే జగన్ కు చిన్నచూపు ఉందని వారికంటే వంశీలాంటి రౌడీలు జగన్ కు ఎక్కువయ్యారా? అని ప్రశ్నించారు.
దళిత యువకుడిని బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేయడానికి వంశీ కుట్ర పన్నారని ఇంతగా బరితెగించిన వ్యక్తిని జగన్ ఎలా సమర్థిస్తారని రామానాయుడు ప్రశ్నించారు.
తప్పును ఖండించకపోగా వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను పునరావృతం కానివ్వబోమని చెప్పారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జగన్ అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటున్నామని చెప్పారు. నేరగాళ్లను సమర్థిస్తున్న జగన్ నైజమేంటో బయటపడిందని అన్నారు.
అధికారంలో లేకపోయినా దళితులను వైసీపీ వాళ్లు టార్గెట్ చేయడం దారుణమని చెప్పారు.
రివర్స్ టెండరింగ్ బ్రహ్మాండమైన సక్సెస్: అంబటి