ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా రౌడీ బాయ్స్. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా రౌడీ బాయ్స్.
దిల్ రాజు సోదరుడు అయిన శిరీష్ కొడుకు ఆశిష్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.హుషారు ఫేం శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఆకట్టుకుంది.

సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో ఆశిష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ..అనుపమ పరమేశ్వరన్ లిప్‌కిస్‌పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. డబ్బులు కోసం ఇంతగా దిగజారిపోతుందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 యాప్‌లో మార్చి 4 నుంచి రౌడీ బాయ్స్ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ అయ్యంగార్, విక్రమ్, కార్తిక్ రత్నం, తేజ్ కురపాటి కీలకపాత్రల్లో నటించారు.

