తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నటరత్న నందమూరి బాలకృష్ణ చిత్రంలో వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ హీరోయిన్ రోజా నటించబోతున్నారా? బాలయ్య హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సినిమాలో విలన్ పాత్ర చేయడానికి రోజా అంగీకరించారా? అవుననే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఈ సినిమాలో పవర్‌ఫుల్ లేడీ విలన్ పాత్ర ఉందట.ఆ పాత్రలో రోజా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. బోయపాటి సినిమాలో విలన్ పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. తన కొత్త చిత్రంలో మహిళను పవర్‌ఫుల్ విలన్ పాత్రలో చూపించబోతున్నారట. ఆ పాత్ర కోసం చాలా మందిని పరిశీలించి చివరికి రోజాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. బాలయ్య, రోజా ఇదివరకే చాలా సినిమాల్లో హీరోహీరోయిన్లుగా కలిసి నటించి సూపర్‌హిట్లు అందుకున్నారు. ఇక, ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ కూడా నటిస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. మరి, ఈ వార్తలన్నీ నిజాలో, కావో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
previous post
next post

