ఒకప్పుడు టాలీవుడ్ లో కథానాయికగా వెలుగొందిన రోజా ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంది. మరోవైపు “జబర్దస్త్”లాంటి షోలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే లాక్డౌన్ వలన ఇంటికి పరిమితమైన రోజా ఇటీవల తాను చేసిన పలు వంటకాలకి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని థ్రిల్ చేసింది. తాజాగా తన ఇంట్లో చేస్తున్న ఎక్సర్సైజ్ కి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో డంబెల్స్‌తో చాలా ఈజీగా వర్కౌట్ చేస్తూ.. చెమటలు చిందిస్తుంది. మోచేతులపై శరీరాన్ని మొత్తం వాల్చి ఒక్క నిమిషం పాటు అలాగే ఉన్న రోజా.. “వన్ మినిట్ ప్లాంక్ ఛాలెంజ్ నేను చేశా మరి మీరు” అంటూ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
							previous post
						
						
					
							next post
						
						
					


అత్యాచారం తప్పదనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయటమే… అమితాబ్ వ్యాఖ్యలు వైరల్