లక్ష్మీఎస్ ఎన్టీఆర్ సినిమాని అడ్డుకోవడం పట్ల ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని తనదైన శైలీలో చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన ఎన్నికల్లో ఓడిపోవాలంటూ వర్మ ట్వీట్లు చేశారు.
‘‘సినిమా కోసం పుట్టి, సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడో అనే సినిమా చూడకుండా ఆపుతున్న తెర వెనక ఉన్న వెన్నుపోటు డైరెక్టర్ కి నాలాంటి కోట్ల ఎన్టీఆర్ అభిమానులందరం కమండలం లో నీళ్లు తీసి శపిస్తున్నాం ..ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక .. తధాస్తు’’ అంటూ ట్వీట్ చేశారు.
హామీలను అమలు చేయకుండా వైసీపీ మాట మారుస్తోంది: లోకేశ్