telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

సినీ ప్రముఖులు భేటీ పోలీస్ కమాండ్ కంట్రోల్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు.  ఇండస్ట్రీకి చెందిన 36 మంది ప్రముఖులు సీఎంతో భేటీ కానున్నారు.

హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం జరగనుంది.

తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధితో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎంతో వీరు చర్చించనున్నారు.

మురళీమోహన్, రాఘవేంద్రరావు, దిల్ రాజు, సి.కల్యాణ్, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, శంకర్, బోయపాటి శ్రీను తదితరులు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు.

ఈ సమావేశానికి ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,
దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు.

కాసేపటి క్రితమే తెలంగాణ డీజీపీ కూడా ఇక్కడకు చేరుకున్నారు.

Related posts