telugu navyamedia
తెలంగాణ వార్తలు

ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు..

హైద‌రాబాద్ హుస్సేన్‌సాగర్‌ అందాలను వీక్షించేందుకు నగరవాసులే కాకుండా దేశ, విదేశీ పర్యాటకులకు వ‌స్తుంటారు. అయితే ప్ర‌జ‌ల సౌకర్యార్థం ట్యాంక్‌బండ్‌పై ఆంక్ష‌లు విధిస్తూ చ‌ర్య‌లు చేప‌ట్టంది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటలకు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ను అనుమతించకుండా కేవలం నగరవాసులు మాత్రమే సరదా గడిపేలా చేసారు.

30 Best Places To Visit In Hyderabad - Popular Sightseeing & Tourist Attractions

అంతేకాకుండా మరిన్ని అదనపు ఆకర్షణలు ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించగా హెచ్‌ఎండీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆటాపాటలతో పాటు సంతోషంగా గడిపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అలాగే  ట్యాంక్‌బండ్‌కు వచ్చే ప్రజల సౌకర్యార్థం, టి.ఎస్.ఆర్టీసీ ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై సందర్శకులను మాత్రమే అనుమతిస్తుండడంతో, సాయంత్రం 4.00 నుండి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌, కోఠి, కాచిగూడ స్టేషన్‌, మెహిదీపట్నం, హకీంపేట, చార్మినార్‌ల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు.

Related posts