telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ప్రైవేట్ లోను.. రిజర్వేషన్ లట…25% ఫీజులు పెంపు కూడా..

reservations in private sector also

ఇప్పటివరకు ప్రభుత్వ విద్యాసంస్థలలోనే ఆయా వర్గాల వారీగా రిజర్వేషన్ లు ఉండేవి, అయితే దీనిని కేంద్రం ప్రైవేట్ సంస్థలకు అనివార్యంగా చేసే కార్యక్రమం చేపట్టింది. దానిలో భాగంగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లతోపాటు కొత్తగా తీసుకొచ్చిన అగ్రవర్ణాలలోని పేదలకు పదిశాతం రిజర్వేషన్ కూడా అమలు చేస్తామని తెలిపారు.

ఇటీవల ఇచ్చిన ఉన్నత వర్గాల రిజర్వేషన్ తో సహా, అన్నిటిని ప్రైవేట్ సంస్థలలో కూడా ఉండనున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 40 వేల కాలేజీలు, 900 యూనివర్సిటీలలో రానున్న విద్యా సంవత్సరం నుంచి పది శాతం రిజర్వేషన్‌ను కూడా అమలు చేస్తామన్నారు. పాత రిజర్వేషన్లకు ఈ పది శాతం అదనమని స్పష్టం చేశారు. కొత్త రిజర్వేషన్ల అమలు కోసం విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లు పెంచనున్నట్టు వివరించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను యూజీసీ, ఏఐసీటీఈ విడుదల చేస్తాయన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నారు. 

రిజర్వేషన్ పేరుతో ఫీజు తగ్గిస్తున్నట్టు .. దానిద్వారా ఆయా ప్రభుత్వ సంస్థలకు పడుతున్న భారాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తుందని, 25శాతం ఫీజు పెంపు లతో దానిని సర్దుబాటు చేస్తున్నారు. ఏమి ఆలోచనో..కదా, దీనిని ప్రజలు అర్ధం చేసుకుంటే చాలా మంచిది. దీనినే వాతపెట్టి, వెన్నరాయడం అంటారు. ఎన్నికల సందర్భంగా తాయిలాలు ఇస్తారు గాని, ఇది నకిలీ తాయిలం; దీనివలన ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు… గమనించగలరు. 

Related posts