telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : హడావిడి చేయడానికి సిద్ధమవుతున్న ఆర్మీలు

Rahul

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ 3 నుండి గత వారం మ‌హేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో బాబాభాస్క‌ర్‌, వరుణ్ సందేశ్‌, వితిక‌, రాహుల్‌, అలీ రెజా, శివ జ్యోతి, శ్రీముఖి ఉన్నారు. అయితే ఈ వారం అందరూ ఎలిమినేషన్ లో ఉండడం విశేషం. మ‌రి వ‌చ్చేవారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఇప్పుడు ఈ సీజన్ ఎండింగ్ కు వచ్చేసింది. ఇప్పటికే టైటిల్ విన్నర్‌ తమ అభిమాన కంటెస్టెంటే కావాలని సోషల్ మీడియాలో వాళ్ల మద్దతు దారులు పెద్దగా కాంపెయిన్ స్టార్ట్ చేసేశారు. గతంలో కౌషల్ ఆర్మీ పేరిట ఆన్ లైన్, ఆఫ్ లైన్ బృందం ఒకటి పుట్టుకొచ్చి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా హైదరాబాద్, వైజాగ్ లో కౌషల్ ఆర్మీ పేరిట 2కే రన్స్ సైతం నిర్వహించి సక్సెస్ అయ్యింది. అయితే ఈ సారి మూడో సీజన్ బిగ్ బాస్ లో సైతం ఆర్మీల గొడవ ఉన్నప్పటికీ కంటెస్టెంట్స్ అందరికీ దాదాపు సమానమైన స్థాయిలోనే ఫాలోయర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మూడో సీజన్ లో టైటిల్ కోసం హోరాహోరీగా తలపడుతున్న వారిలో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, అలీరెజా, శ్రీముఖి ఫాలోయర్ల వాయిస్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ఇక చివరిగా ఆర్మీ రూపంలో రోడ్ల మీదకు వచ్చేసేందుకు సైతం సిద్ధమైపోతున్నారు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ పేరిట ఆర్మీ ఒకటి రంగంలోకి దిగింది. హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన రాహుల్ కు ఓల్డ్ సిటీనుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని రాహుల్ ఆర్మీ స్థాపకులు సోను తెలిపారు. రాహుల్ యాటిట్యూడ్, అలాగే అతడిని అందరూ కార్నర్ చేస్తూ ఇబ్బంది చేయడం కూడా తమను ఆర్మీ ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం ఇచ్చిందని సోను తెలిపారు. అయితే ఓటింగ్ బేస్ పెంచడం కోసం వాళ్ల వాళ్ల ఫాలోయర్లు అన్ని రకాల టెక్నిక్కులను వాడేస్తున్నారు.

Related posts