రెడ్డి, వెలమ కులస్తులకు బలుపు ఎక్కువని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యల పై ఆయన వివరణ ఇచ్చారు. తాను కావాలని ఎవరినీ కించపరచలేదని… తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు. తన మాటలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని కోరారు. కొందరు కావాలనే తన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రెడ్లు, వెలమల సహకారంతోనే తాను ఎమ్మెల్యే అయ్యానని చెప్పారు.
క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు దుస్తులు పంచే ఓ కార్యక్రమంలో శంకర్ నాయక్ మాట్లాడుతూ రెడ్లు, వెలమలకు మూడు బలుపులుంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము రెడ్లు, వెలమలనే బలుపు ఒకటి కాగా, బాగా డబ్బుందనే బలుపు రెండోదని, బాగా చదువుకున్నామనే బలుపు మూడోదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆయా సామాజికవర్గాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.