telugu navyamedia
సినిమా వార్తలు

వినాయ‌కచవితికి “డిస్కోరాజా” సర్ప్రైజ్

Disco-Raja

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో “డిస్కో రాజా” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ దర్శకుడు గతంలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ వంటి చిత్రాలను రూపొందించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. “డిస్కో రాజా” చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. నభా నటేశ్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనున్న‌నేప‌థ్యంలో త‌మిళ స్టార్ బాబీ సింహాని ప్ర‌తి నాయ‌కుడిగా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ లుక్ ఇటీవ‌ల విడుద‌లైంది. త్వ‌ర‌లో పూర్తి లుక్ విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ అన్నారు. అయితే చిత్రంలో ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా రవితేజ యంగ్ లుక్ అంటూ ఒక పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై ద‌ర్శ‌కుడు ఆనంద్ ఆ ఫోటో రవితేజాది కాదంటూ తన ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, సెప్టెంబ‌ర్ 2న వినాయ‌క చవితి సంద‌ర్భంగా ర‌వితేజ లుక్ రివీల్ చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. చిత్రాన్ని ఏడాది చివ‌రలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

Related posts