నటరత్న, పద్మశ్రీ ఎన్.టి. రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం రామకృష్ణ సినీస్టూడియోస్ వారి
“అగ్గిరవ్వ” సినిమా 14-08-1981 విడుదలయ్యింది .
నందమూరి హరికృష్ణ నిర్వహణ లో రామకృష్ణ సినీస్టూడియోస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు కె.బాపయ్య గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి కథ: వి.సి.గుహనాధన్, స్క్రీన్ ప్లే: బాపయ్య, మాటలు: గొల్లపూడి, పాటలు: ఆత్రేయ, సంగీతం: కె.వి. మహదేవన్, ఫోటోగ్రఫీ: నందమూరి మోహన కృష్ణ, , కళ: కృష్ణారావు, నృత్యం: శ్రీనివాస్, ఎడిటింగ్: రవి అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, శ్రీదేవి , జగ్గయ్య, మోహన్ బాబు, కవిత, సత్యనారాయణ, రాజ్యలక్ష్మి, అల్లురామలింగయ్య, రాజబాబు, ఎస్.వరలక్ష్మి, శ్రీహరి,చిడతల అప్పారావు, గీత, సుకుమారి,
తదితరులు నటించారు.
ప్రఖ్యాత సంగీత దర్శకులు కె.వి.మహాదేవన్ గారి స్వరకల్పనలో పాటలు హిట్ అయ్యాయి.
“కాశీకి పోయాం రామహరే గంగలో పడ్డాం రామాహరే”
“లేతపిందెలో వగరుంది దోరకాయలో పులుపుంటుంది”
“పండైతే పనికిరాదు ఆవకాయకు పంటి కింద కరకర లాడేందుకు”
“పారిపోతోంది, జారిపోతోంది, పట్టుకో,పట్టుకో, పట్టుకో, చెంతకొస్తుంది,”
వంటి హిట్ పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
ఎన్టీఆర్ గారి తనయుడు నందమూరి మోహనకృష్ణ గారు తొలిసారిగా ఈ చిత్రాన్నికి కెమెరామెన్ గా పనిచేశారు.
ఇంగ్లీష్ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను ఆధారంగా మంచి యాక్షన్ చిత్రం గా దీన్నీ రూపొందించారు.
కాగా ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకుని కొన్ని కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడింది.
విజయవాడ దుర్గా కళామందిర్ లో 50 రోజులు పైగా ప్రదర్శింపబడింది.