telugu navyamedia
సినిమా వార్తలు

మాస్ మహారాజా దర్శకత్వంలో నందమూరి హీరో

Raviteja

మాస్ ఎంటర్టైన్మెంట్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో రవితేజ. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో తన అభిమానులకు వినోదం అందిస్తూ వచ్చాడు ఈ మాస్ హీరో. గత ఏడాది మూడు చిత్రాలతో పలకరించిన రవితేజ అందులో ఒక్క హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఈ ఏడాది రెండు సినిమాలతో పలకరించనున్నాడు. వాటిలో ఒకటి వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ ‘డిస్కో రాజా’, మరొకటి తమిళ హిట్ ‘తేరి’కి రీమేక్‌గా సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించే ‘తెరి’ రీమేక్‌కి “కనకదుర్గ” అనే టైటిల్ ను ఖరారు చేయబోతున్నారు అని టాక్.

ఇదిలా ఉంటే.. గతంలో రవితేజ దర్శకత్వ శాఖలో పని చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు “నేనింతే” సినిమాలో దర్శకుడి పాత్రలో కన్పించాడు కూడా. అయితే ఇన్నాళ్లూ హీరోగా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల దర్శకత్వం వైపు దృష్టి సారించలేకపోయాడు రవితేజ. తాజా సమాచారం ప్రకారం త్వరలో రవితేజ మెగాఫోన్ పట్టనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే తన “కిక్ 2” చిత్ర నిర్మాత, హీరో కళ్యాణ్ రామ్‌కి రవితేజ ఓ ఇంట్రెస్టింగ్ లైన్ వినిపించాడని టాక్. కళ్యాణ్ రామ్ కు స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమాలో తనే హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. త్వరలో రవితేజ డైరెక్షన్ పై స్పష్టత రానుంది. నటుడుగా విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్న రవితేజకు మరి దర్శకుడిగా ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారో చూడాలి.

Related posts