telugu navyamedia
సినిమా వార్తలు

వీడియో వైరల్ : యాంకర్ కు రానా కౌంటర్…

Rana

“బాహుబలి”తో రానా నటుడిగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇతర భాషల్లో కూడా రానాకు భారీగా క్రేజ్ ఏర్పడింది. ఇటీవల రానా ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో రానా యాంకర్ కు ఇచ్చిన కౌంటర్… అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు యాంకర్ తన చిన్నతనంలో “రోజా” సినిమా చూశానని ఆ తర్వాత చూసిన సౌత్ ఇండియన్ సినిమాలన్నీ ఒకే తరహాలో ఉన్నట్లు తనకు అనిపించిందని, కానీ “బాహుబలి” చిత్రం ఓ అద్భుతం అని, ఆ చిత్రంతో సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ లో చాలా మార్పు వచ్చిందని అభిప్రాయపడింది. దీనిపై రానా స్పందిస్తూ… “ఇండియన్ సినిమా అభిమానులకు ఇతర భాషల సినిమాలపై ఇలాంటి అభిప్రాయం ఉంటుందని నేననుకోను. అసలు ఇండియన్ మూవీ లవర్స్ భాష గురించి పట్టించుకోరు. అన్ని సినిమాలని ఆదరిస్తారు. బాహుబలి కంటే ముందు రజినీకాంత్ సినిమాలు అన్ని భాషల్లో విజయం సాధించాయి. అవెంజర్స్ చిత్రం ఇండియాలోని అన్ని భాషల్లో రిలీజై విజయం సాధించింది. మీరంటున్నట్లు భాష సరిహద్దులు లేవు” అని రానా అన్నారు.

Related posts