telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సప్తగిరి కొత్త సినిమా… రేపే ఫస్ట్ లుక్‌ను విడుదల

టాలీవుడ్ లో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సప్తగిరి తన ట్రాక్ మార్చాడు. కమెడియన్‌గా కాకుండా హీరోగా కొన్ని సినిమాలు తెరకెక్కించాడు. వాటిలో సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీలు కూడా ఉన్నాయి. హీరోగా కూడా మంచి పేరు సంపాధించిన సప్తగిరి. ఇటీవల మరో సినిమాను మొదల పెట్టాడు. ఈ సినిమా ఇల్యూజన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వచ్చే నెల మొదలు కానుంది. ఈ సినిమాను రిజ్వానా ఎంటర్‌టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. దీనికి ఎయిట్ అనే పేరును ఖరారు చేశారు. అయితే రేపు నూతన సంవత్సర కానుకగా రేపు మధ్యహ్నం ఒంటిగంటకి ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను మొత్తం నాలుగు భాషల్లో తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. దాంతో పాటుగా థ్రిల్లర్ సినిమాలో సప్తగిరి ఎలా చేయనున్నాడని ప్రేక్షకులు ఎదురు చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా… సప్తగిరి ప్రేక్షకులని మరో సారి హీరోగా అభిమానులను మెప్పిస్తాడా లేదా అనేది.

Related posts