దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లోని మొత్తం 19 రాజ్యసభ స్థానాలతో పాటు గతంలో వాయిదా పడ్డ ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో 4, గుజరాత్‌లో 4, రాజస్థాన్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 3, ఝార్ఖండ్‌లో 2, మణిపూర్, మిజోరం, మేఘాలయాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క సీటుకు చాలా గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నాలుగు స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది.అసెంబ్లీ కమిటీ హాలు-1లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. వైసీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ, టీడీపీ నుంచి వర్ల రామయ్య ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే.మార్చిలో జరగాల్సిన ఆ ఎన్నికలు కరోనా వైరస్ వల్ల వాయిదా పడ్డాయి.

