నటుడు రజనీకాంత్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో భేటీ తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తలైవా (రజనీకాంత్) రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానులకు 25 ఏళ్ల కల. అయితే ఆ దేవుడు ఆదేశిస్తే ఈ రజనీ పాటిస్తాడు అంటూ కర్ర విరగరాదు పాము చావరాదు అన్న చందంగా దాటవేస్తూ వచ్చారు రజనీకాంత్. రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అంటున్న రజనీకాంత్ ఇప్పటి వరకూ పార్టీని కూడా ప్రారంబించలేదు. పార్టీ జెండా, అజెండా ఏమిటో ఎవ్వరికి తెలియదు. ఆయన పాటికి ఆయన ప్రశాంతంగా సినిమాల్లో నటించుకుంటూపోతున్నారు. ఇది ఆయన అభిమానుల్లో అసహనానికి గురి చేస్తోంది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా రజనీకాంత్ అభిమానుల్లో ఆనందం కట్టలు తెంచుకుంటోంది. కారణం ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్‌తో రజనీకాంత్ భేటీ కావడమే.
2014లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదికి, రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ వ్యవహించారు. ఆ ఎన్నికలో భారతీయ జనతాపార్టీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో గత శాసనసభ ఎన్నికల సమయంలో జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల రాజకీయ పార్టీ నాయకుల దృష్టి ప్రశాంత్ కిశోర్‌పై పడింది. ఇందుకు తమిళనాడు రాజకీయ పార్టీలు అతీతం కాదు.
ప్రభుత్వ ఆస్తుల రక్షణ బాధ్యత గవర్నర్ దే: రేవంత్ రెడ్డి