ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ తీసుకోవడంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ కు వచ్చింది. అయితే వచ్చి రాగానే ఢిల్లీ జట్టుకు రాయల్స్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ షాక్ ఇచ్చాడు. తాను మొదటి మూడు ఓవర్లలో పృథ్వీ షా, ధావన్ అలాగే రహానే ను ఔట్ చేసాడు. కానీ ఆ తర్వాత కష్టాల్లో పడిపోయిన ఢిల్లీని ఆ జట్టు కెప్టెన్ పంత్(51) అర్ధశతకంతో ఆదుకున్న ఆ తర్వాత వరుసగా అందరూ బ్యాట్స్మెన్స్ పెవిలియన్ బాట పట్టడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కట్ 3 వికెట్లు తీయగా ముస్తాఫిజుర్ 2 వికెట్లు క్రిస్ మోరిస్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలవాలంటే 148 పరుగులు చేయాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. అయితే గత మ్యాచ్ లో 222 పరుగుల లక్ష్యాన్ని చేధించినత పని చేసిన రాయల్స్ కు ఇది పెద్ద టార్గెట్ అయితే కాదు. మరి ఏం జరుగుతుంది చూడాలి.
							previous post
						
						
					
							next post
						
						
					

