ఈ రోజు ఐపీఎల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ మొదట బౌలింగ్ చేయనుంది. అయితే చెన్నై బ్యాట్స్మెన్స్ ను రాయల్స్ బౌలర్లు బాగానే కట్టాడు చేసారు. చెన్నై జట్టులో జడేజా చేసిన 35 పరుగులే ఆ జట్టు తరపున ఓ ఆటగాడు అత్యధిక పరుగులు. జట్టు టాప్ ఆర్డర్ మొత్తం విఫలం కావదంతి చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. ఇక రాజస్థాన్ బౌలర్లు రాహుల్ తివాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగి ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో రాయల్స్ విజయం సాధించాలంటే 126 పరుగులు చేయాలి. అయితే చెన్నై జట్టులో ఇంత తక్కువ పరుగులను కాపాడే బౌలర్ లేదు అనే చెప్పవచ్చు. అయితే పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న ఈ రెండు జట్లలో ఎవరి విజయం సాధిస్తే వారికి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. మరి ఈ లక్ష్యాన్ని ఛేదించి రాజస్థాన్ గెలుస్తుందా.. లేదా అనేది చూడాలి.
previous post
ఏపీ మెజారిటీ ప్రజలు రోడ్ల మీదకు వస్తే హైదరాబాద్ పరిస్థితేంటి: శివాజీ