telugu navyamedia
రాజకీయ వార్తలు

బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా మాకే ఓటేస్తారు: అశోక్ గెహ్లాట్

Ashok gehalot rajasthan

రాజస్థాన్ రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం సుప్రీంకోర్టు ముంగిట చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. కొందరు ఎమ్మెల్యేలను బందీలుగా పెట్టుకుని వారికి బౌన్సర్లను కాపలాగా పెట్టారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో తమకు పూర్తి మెజారిటీ ఉందని, తామంతా ఐకమత్యంగానే ఉన్నామని సీఎం పేర్కొన్నారు. బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా మాకే ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థల దాడులకు భయపడే ప్రసక్తే లేదని గెహ్లాట్ తేల్చి చెప్పారు. తన సోదరుడి ఇంటిపై ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో స్పందించారు. కొందర్ని లక్ష్యంగా చేసుకుని ఆ సంస్థలు పనిచేస్తున్నాయని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, క్షమించబోరని హెచ్చరించారు.

Related posts