telugu navyamedia
సినిమా వార్తలు

అంచ‌నాలు పెంచేలా ..అదిరిపోయే ప్రోమో..!

ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ భారీగా ప్లాన్ చేసింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కూడిన డైలాగ్స్‌తో ఉండేలా ఓ స్పెషల్ ప్రోమో వీడియో కట్ చేసే పనిలో ఉన్నారట రాజమౌళి. ప‌వ‌ర్ స్టార్ రామ్‌ చరణ్ మరియు యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా “ఆర్ ఆర్ ఆర్. రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

RRR Diwali - Pics - IndustryHit.Com

ఇప్ప‌టికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు మొద‌లైయ్యాయి. ఇందులో తారక్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్ర పోషిస్తున్నాడు. మరో స్వాతంత్ర్య సమరయోధుడు పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ నటిస్తున్నాడు.

Emotional action sequences in 'RRR'?

ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్న ఎవరు మీలో కోటీశ్వరుడు రియాలిటీ గేమ్ షోలో తొలి ఎపిసోడ్‌లో రామ్ చరణ్ తొలి అతిథిగా రానున్నారు. అంతేకాదండోయ్.. తారక్, చెర్రీ ఇద్దరూ కలిసి నటిస్తున్న అప్‌కమింగ్ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఒక చిన్న ప్రోమో కూడా విడుదల కానున్నట్టు తెలుస్తోంది.

RRR (Telugu) All Songs Download Mp3 • GizPrix Music

ఈ కారణంగానే ఎవరు మీలో కోటీశ్వరుడు షోతో పాటు ఆర్ఆర్ఆర్ ప్రోమో కూడా చూడవచ్చని ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్‌ ప్రశ్నకు రామ్‌చరణ్‌ ఏమన్నారంటే? - evaru meelo koteeswarulu ntr and ram charan

ఆర్ఆర్ఆర్ మూవీ అక్టోబర్ 13న భారీ సంఖ్యలో థియేటర్లతో అభిమానుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో ఈ విధంగా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కూడా ప్రారంభిస్తున్నట్టు టాలీవుడ్ టాక్. మరోవైపు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల తో ఒక ఫ్రెండ్ షిప్ సాంగ్ కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు దర్శకనిర్మాతలు.

కాగా..ఇప్పటికే పలు ప్రత్యేక సందర్భాల్లో, పలు వేదికలపై ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ వీడియోలు, పోస్టర్లు విడుదల కాగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts