రాజమండ్రి రూరల్ నుండి పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన తన సమీప ప్రత్యర్థి వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పైన విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా కూటమి హవా కొనసాగుతోంది.
దాదాపు మెజార్టీ స్థానాల్లో క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో టీడీపీ-జనసేన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
రాష్ట్రంలో తొలి ఎన్నికల ఫలితం వచ్చింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి 64,090 వేల ఓట్లు ఆధిక్యంతో బోణీ కొట్టారు.
రాజమండ్రి రూరల్ నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పైన విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ప్రస్తుతం సంబరాలు జరుపుకుంటున్నాయి.