తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ కానున్నారు. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రి గవర్నర్ తో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే మహమూద్ అలీని కేబినెట్ లోకి తీసుకున్న కేసీఆర్ కొత్తగా మరో 10 మందికి ఈసారి మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.ఏపీ ప్రతిపక్ష నేత జగన్ గృహప్రవేశ కార్యక్రమానికి నిన్న కేసీఆర్ వెళ్లాల్సి ఉన్నప్పటికీ జగన్ సోదరి షర్మిల, బావ అనిల్ లు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో గృహప్రవేశం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
previous post
next post
జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన నారాయణ