telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

వచ్చే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు!

rains in telugu states today

బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటంతో తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్మాయి. నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వచ్చే 24 గంటల్లో సైతం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.

నిన్న వరంగల్, భూపాలపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో వర్షం కురిసింది. భూమి ఉపరితలానికి ఒకటిన్నర కిలోమీటరు పైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలియజేశారు.

Related posts