హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని తెలంగాణ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్‌నగర్‌లో రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంత ఓటర్లు విలక్షణ తీర్పు ఇవ్వాలని కోరారు.
హుజూర్‌నగర్ అభివృద్ధి దిశగా దూసుకెళ్లాలంటే టీఆర్‌ఎస్ గెలవాలన్నారు. హుజూర్‌నగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరబోతోందని జోస్యం చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతం: రవితేజ