telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

rains in telugu states today

తెలుగు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అరేబియా మధ్య ప్రాంతం నుంచి కర్ణాటక మీదుగా విదర్భ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

ఉపరితలానికి 900 మీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. దీని ప్రభావం తెలంగాణపై అధికంగా ఉంటుందని అంచనా వేశారు. ఇదే సమయంలో ఉత్తర కోస్తాంధ్ర, ప్రకాశం, గుంటూరు జిల్లాలపై ప్రభావం చూపుతుందని, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనావేశారు.

Related posts