telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఈటెల రాజకీయాలపై హరీష్ రావు మండిపాటు

వీణవంకలో మండలంలో దేశాయిప‌ల్లి ఫంక్ష‌న్ హాల్‌లో టీఆర్ఎస్ ముఖ్య కార్య‌క‌ర్త‌లు, స‌మ‌న్వ‌య స‌మితి క‌మిటీ, బూత్ క‌మిటీ ఇంఛార్జిల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి మంత్రి హ‌రీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. హ‌రీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డి, పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు ల‌క్ష్మ‌ణ్ రావు, జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ విజ‌య‌, పాడి కౌశిక్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పాల్గొన్నారు. మంత్రి హ‌రీశ్‌రావు స‌మ‌క్షంలో వైస్ ఎంపీపీ ల‌త స‌హా ప‌లువురు కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. మీ సహకారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇద్దాం అన్నారు. 2-3 రోజుల్లో 24/7 పనిచేసేలా ఆస్పత్రి, పోస్ట్ మార్టం కేంద్రం మంజూరుకు కృషి చేస్తా. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్, సంజయ్ ఇక్కడి వాళ్లా? అసహనంతో ఈటెల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది. బీజేపీ అమ్మకానికి టీఆర్ఎస్ నమ్మకానికి మరో రూపం చావు నోట్లో తలపెట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తామంటే కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

ఇవాళ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నాము. కాళేశ్వరం పూర్తవుతుంది అన్నారు. రైతులు వద్దనే రీతిలో నీళ్లు వస్తున్నాయి. నీటి తీరువా రద్దు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏ కష్టం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు పెడతామంటోంది. రైళ్లు, రోడ్లు అమ్మితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది. సీఎం కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే.. కేంద్రం ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తోంది. ఈటెలకు రైతుల పట్ల ప్రేమ ఉంటే యాసంగి లో ఎన్ని వడ్లు పండినా కొంటామని ఒప్పించాలి. ఈటెల తన బాధను ప్రపంచ బాధగా చిత్రీకరిస్తున్నాడు. ప్రజల కష్టం తన కష్టంగా భావించే గొప్ప నేత సీఎం కేసీఆర్. మేనిఫెస్టోలో పెట్టకున్నా పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మీ అందిస్తున్నాము. గెల్లు శ్రీనివాస్ యాదవ్ పనిచేయించగలిగిన నాయకుడు. ఆనాడు ప్రజల కోసం కేసీఆర్ రాజీనామా చేసాడు.

ఈటెల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసాడో చెప్పాలి ప్రజలు బాగుపడలా. ఈటెల బాగుపడలా ఆలోచించండి హుజురాబాద్ కు మీరు కూడా వెయ్యి కోట్లు తెచ్చి ఓట్లు అడగండి. బీజేపీ చేసిన మంచి పని ఏందో చెప్పాలి కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదు. రైతులను బాగు చేసిన టీఆర్ఎస్ కు ఓటేద్దామా.. రైతు నడ్డి విరిచిన బీజేపీకి ఓటేద్దామా ఆలోచించాలి. పోటీ టీఆర్ఎస్, బీజేపీకి మధ్య జరుతోంది. ఎవరు గెలిస్తే లాభం జరుగుతుందో ఆలోచించాలి. మీ చరిత్రలో నీళ్లు, కరెంటు కోసం బాధ పడే రోజులు ఉండవు. ఈటెల గడియారాలు, కుట్టు మిషన్లు, కుంకుమ భరిణలను నమ్ముకుంటే.. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని నమ్ముకుంది. టీఆర్ఎస్ కష్టాల్లో తోడుగా ఉన్నాం.. ఆపద మొక్కులు మొక్కే వాళ్ళం కాదు.

ఏడేళ్లు మంత్రిగా ఉండి చేయని అభివృద్ధి.. ఈటెల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి చేస్తాడా. గడప గడపకు వెళ్లి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లండి. బీజేపీ నేతలు ఇక్కడ తీర్ధ యాత్రలు కాదు.. ఢిల్లీకి యాత్ర చేయాలి.కేంద్రం 6 లక్షల కోట్లను కుదువు పెట్టే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ వ్యవస్థను కూలదొస్తోంది.. కుదువు బెడుతోంది.. వ్యవస్థను కూలదోసే వాళ్ళ వైపు ఉందామా.. వ్యవస్థను నిలబెట్టే వాళ్ళ వైపు ఉందామా. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు విషయంలో ఎలాంటి సందేహం లేదు. హుజురాబాద్ టీఆర్ఎస్ గడ్డ ఈటెల రాక ముందు ఈ గడ్డపై గులాబీ జెండా ఎగిరింది.. ఎప్పుడు కూడా ఎగురుతుంది. బీజేపీకి డిపాజిట్ రాకుండా చేయాలి. బీజేపీ ఏం చెప్పి హుజురాబాద్ ప్రజలను ఓటు అడుగుతుంది. హుజురాబాద్ కు బీజేపీ ఏం చేసింది. బండి సంజయ్ వీణవంకలోని ఏ గ్రామలోనైనా 10 లక్షలైనా ఖర్చు చేశాడా. దత్తత తీసుకున్న రామకృష్ణపూర్ కు బండి సంజయ్ రూపాయి పని చేయలేదు. ఢిల్లీ బీజేపీ వాళ్ళు వచ్చినా ఏం చేయలేరు అని మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు.

Related posts