telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ముంచుకొస్తున్న తౌక్టే తుఫాన్ ..ఏపీకి తప్పని ముప్పు

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ఇండియాలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. దేశంలో ముంపు దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూరుకు 360 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగాల మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత బలపడి ఈ నెల 16న తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫానుగా మారితే దీన్ని ‘తౌక్టే’ అని పిలుస్తారు. ‘తౌక్టే’ తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది.. గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక ఈ తుఫానును ఎదురుకునేందుకు కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో 53 బృందాలను మోహరించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. ఈ తుఫాను ఎఫెక్ట్ తో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ, రేపు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తాంధ్రలో, రాయలసీమలో ఈ రెండు రోజులు 20-40 కి. మీ వేగంతో గాలులు వీయనున్నాయి. రాయలసీమలో అనేక చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Related posts