telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ : రాహుల్ సింప్లిగంజ్ కు దక్కేది 50 లక్షలు కాదట… ఎందుకంటే…!

rahul sipliganj won bigg boss 3 title

105 రోజుల బిగ్ బాస్ నాగార్జున హోస్ట్‌గా 17 మంది కంటెస్టెంట్స్‌తో జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ సీజన్ 3‌లో ఆదివారం నాడు విజేతను ప్రకటించారు. బిగ్‌బాస్‌ తెలుగు 3 టైటిల్‌ను సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ గెలుచుకున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ రూ.50లక్షల నగదు బహుమతిని దానితో పాటు ఓ ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే. అయితే నిజానికి రాహుల్ సిప్లిగంజ్ తన ప్రైజ్ మనీ మొత్తం అందుకోలేదనే వార్తలు వస్తున్నాయి. ఒప్పందం ప్రకారం విన్నర్‌కు రూ. 50 లక్షలు దక్కాల్సి ఉంది. అయితే రాహుల్‌కు మాత్రం కేవలం రూ.35 లక్షలు మాత్రమే దక్కాయనే వార్తలు వస్తున్నాయి. అయితే దీని వెనుక ఉన్న మతలబు ఏంటా అని ఆరా తీస్తే ఇంకమ్ టాక్స్ నిబంధనల ప్రకారం సెక్షన్ 56(2) (ib) కింద లాటరీలు, గుర్రపు పందాలు, అలాగే టెలివిజన్ గేమ్ షోలో గెలిచిన మొత్తంలో దాదాపు 31.20 శాతం టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే బిగ్ బాస్ ద్వారా రాహుల్ అందుకున్న ప్రైజ్ మనీ రూ. 50 లక్షల్లో టాక్స్ కట్ చేస్తే చేతిలో మిగిలేది కేవలం రూ.35 లక్షల చిల్లర మాత్రమే అని తెలుస్తోంది. అయితే అతని రెమ్యూనరేషన్ అన్నీ కలుపుకుని సుమారుగా రాహుల్‌ చేతికి అందేది రూ. 50 లక్షలు మాత్రమే.

Related posts