తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఉద్యోగాల భర్తీ కోసం వసూల్ చేసే పరీక్షల ఫీజును రద్దు చేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈమేరకు ఫేస్‌బుక్ వేదికగా ‘కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వసూలు చేసే పరీక్షల దరఖాస్తు ఫీజును ఎత్తివేస్తాం’ అని పోస్టు చేశారు. అదే విధంగా దేశ ప్రజలందరికీ ‘ఆరోగ్యం ప్రాథమిక హక్కు’గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటామని పోస్ట్‌లో పేర్కొన్నారు. దానికి తగిన విధంగా బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తామని రాహుల్ వెల్లడించారు. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన కాంగ్రెస్ అందులోనూ నిరుద్యోగులు, పేదలను ఆకర్షించే పథకాలను రూపొంచింది. ఖాళీగా ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని హామి ఇచ్చింది.
previous post