telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నైట్ కర్ఫ్యూ ను పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో రాష్ట్ర ప్ర‌భుత్వం గతంలో నైట్ క‌ర్ఫ్యూ విధించింది.. అది ఈ రోజుతో ముగిసిపోగా.. జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తుంటే.. ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌కు వెళ్తుందేమో అనే ప్ర‌చారం కూడా సాగింది.. మంత్రులు ఎప్ప‌టిక‌ప్పుడు ఈ ప్ర‌చారాన్ని కొట్టిపారేసినా.. స‌మీక్ష‌లు, ఉన్న‌త‌స్థాయి స‌మావేశాలు జ‌రిగితే మాత్రం.. ఏదో నిర్ణ‌యం జ‌రుగుతుంద‌నే గుస‌గుస‌లు వినిపించాయి. ఇక‌, వాటికి ఫులిస్టాప్ పెడుతూ.. నైట్ కర్ఫ్యూ ను పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం… మ‌రో వారం రోజులు నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది.. ప్ర‌భుత్వ తాజా ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది.. ఈ క‌ర్ఫ్యూ రాత్రి 9 గంట‌ల నుంచి మ‌ర్నాడు ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంద‌ని గ‌తంలోనే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే కాగా.. అత్య‌వ‌స‌ర‌, నిత్య‌వ‌స‌రాల‌తో పాటు మ‌రికొన్ని రంగాలకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. చూడాలి మరి ఈ వరం తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది.

Related posts