telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రీడలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పీవీ సింధుకు ఘన సన్మానం

భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ కాంస్య పతకం విజేత, ఆర్.ఎన్‌.ఐ.ఎల్ బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధును సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘనంగా సన్మానించారు. ఇండోర్ స్టేడియంలో చిన్నారుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను సింధు ప్రారంభించారు. విమల విద్యాలయంలో చిన్నారులతో పీవీ సింధు కాసేపు ముచ్చటించారు. క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు పతకాలను అందచేశారు. తనపై ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే ఉత్సాహంతో వచ్చే 2024 ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధిస్తానని అన్నారు. విశాఖ ఉక్కు తనకు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనని పీవీ సింధు అన్నారు. ఎంతో మంది ప్రతిభగల క్రీడాకారులు ఉక్కు నగరంలో వున్నారని వారికోసం బాడ్మింటన్ అకాడమీ తెరవడానికి కృషి చేస్తున్నానని అన్నారు. మీఅందరి ప్రోత్సాహంతోనే ఒక ఉన్నతస్ధాయి క్రీడాకారిణిగా రాణించానని పీవీ సింధు అన్నారు. రాబోయే రెండేళ్లలో ఇక్కడి నుంచే పతకాలు సాధించే క్రీడాకారులు తయారవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Related posts