telugu navyamedia
క్రీడలు

మ‌న‌సులో మాట చెప్పిన సింధు!

ఒలింపిక్స్‌లో తాజాగా రెండో పతకం సాధించి పీవీ సింధు మ‌రోసారి దేశానికి గుర్తింపు తెచ్చుకుంది. ఒలింపిక్స్ లో కాంస్యపతకాన్ని సాధించి భారతదేశ మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన సింధు స్వదేశానికి చేరుకున్న తరువాత త‌న‌ అనుభ‌వాల‌ను మీడియ తో పంచుకుంది. సింధు తన ఒలింపిక్ జర్నీపై, ఫ్యూచర్ ప్లాన్స్ పై చెప్పుకొచ్చింది.

రెండు ఓలింపిక్స్‌లో రెండువ‌రుస మెడ‌ల్స్ సాధించారు, ఇది ఎలాంటి మోటివేష‌న్ ఇస్తుంద‌ని అడ‌గ్గా..ఈ మెడ‌ల్స్ చాలా మోటివేష‌న్ ఇస్తాయి..రెండువ‌రుస మెడ‌ల్స్ సాధించ‌డం అంత తేలికైన విష‌యం కాదు. నేను చాలా ఎత్తు ప‌ల్లాలు చూసాను..కానీ ఈ జ‌ర్నీ అందంగా ఉంద‌ని చెప్పారు.

ఆటలోనైనా, జీవితంలోనైనా గెలుపోటములు సహజం. ఓడిన ప్రతిసారీ బాధపడతా. అలాగని దాన్ని అధిగమించలేకపోతే… విజేతలం కాలేం. ఊహ తెలిసినప్పటి నుంచి బ్యాడ్మింటనే నా ప్రపంచం. అది మనసుకెంతో తృప్తినిస్తుంది. అమ్మాయిలకీ అదే చెబుతా.. మనసుకి నచ్చిన రంగాన్ని ఎంచుకోమని! అప్పుడే అనుకున్నది సాధిస్తారు. ప్ర‌స్తుతం భార‌త్‌లో మ‌హిళ‌లు స్పోర్ట్స్‌లోచాలా బాగా రాణిస్తున్నారు.

ఒలింపిక్స్‌లో తాజాగా రెండో పతకం సాధించి పీవీ సింధు మ‌రోసారి దేశానికి గుర్తింపు తెచ్చుకుంది. ఒలింపిక్స్ లో కాంస్యపతకాన్ని సాధించి భారతదేశ మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన సింధు స్వదేశానికి చేరుకున్న తరువాత ఢిల్లీలో ప‌లు మీడియ తో మాట్లాడి త‌న‌ అనుభ‌వాల‌ను పంచుకుంది. సింధు తన ఒలింపిక్ జర్నీపై,ఫ్యూచర్ ప్లాన్స్ పై చెప్పుకొచ్చింది.

రెండు ఓలింపిక్స్‌లో రెండువ‌రుస మెడ‌ల్స్ సాధించారు , ఇది ఎలాంటి మోటివేష‌న్ ఇస్తుంద‌ని అడ‌గా..ఈ మెడ‌ల్స్ చాలా మోటివేష‌న్ ఇస్తాయి..రెండువ‌రుస మెడ‌ల్స్ సాధించ‌డం అంత తేలికైన విష‌యం కాదు. నేను చాలా ఎత్తు ప‌ల్లాలు చూసాను..కానీ ఈ జ‌ర్నీ అందంగా ఉంద‌ని చెప్పారు.

ఆటలోనైనా, జీవితంలోనైనా గెలుపోటములు సహజం. ఓడిన ప్రతిసారీ బాధపడతా. అలాగని దాన్ని అధిగమించలేకపోతే… విజేతలం కాలేం. ఊహ తెలిసినప్పటి నుంచి బ్యాడ్మింటనే నా ప్రపంచం. అది మనసుకెంతో తృప్తినిస్తుంది.ప్ర‌స్తుతం భార‌త్‌లో అమ్మాయిలు స్పోర్ట్స్‌లో చాలా బాగా రాణిస్తున్నారు. భ‌విష్య‌త్తులో మ‌రింత మంది భార‌త్ త‌రుపున ఆడుతార‌ని ఆశిస్తున్న. మహిళ‌లు త‌న‌ను తాను న‌మ్మ‌డం ముఖ్య‌మ‌ని, అమ్మాయిలకీ అదే చెబుతా.. మనసుకి నచ్చిన రంగాన్ని ఎంచుకోమని! అప్పుడే అనుకున్నది సాధిస్తారు.

ఈ సంవ‌త్స‌రం గ్యాప్‌ని నా స్కిల్ ని పెంచుకోవ‌డానికి ఉప‌యోగించాన‌ని, ప్యారిస్ ఓలింపిక్స్ ఖ‌చ్చితంగా ఆడుతాన‌ని, బాగా ప్రాక్టీస్ చేసి బాగా ఆడ‌తాన‌ని, నా లక్ష్యం 2024 ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించ‌డ‌మ‌ని చెప్పింది. పెళ్ళి గురించి ప్ర‌స్తావించ‌గా ..మం చి మనసుతో పాటు నన్ను అర్థం చేసుకుని నన్ను నన్నుగా ప్రేమించే వాడై ఉండాలి. అలాంటి వ్యక్తి ఇంకా ఎదురుపడితే ఆలోచిస్తాన‌ని చెప్పారు.

Related posts