నవంబర్ 13 నుండి 24 వరకు పుట్టపర్తి లో జరిగే సత్యసాయి బాబా శతాబ్ది జయంతి వేడుకలకు దాదాపు 140 దేశాల నుండి భక్తులు తరలివస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి సి పి రాధాకృష్ణన్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు.
పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ ఆర్టీసీ 200 ప్రత్యేక బస్సులు నడుపుతుందని ఆ సంస్థ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
సత్యసాయి శత జయంతికి పుట్టపర్తికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి దేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని భావిస్తున్నారు, మరియు తాత్కాలిక ఆశ్రయాలతో సహా ఉచిత ఆహారం మరియు బసను అందించడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.


జగన్ సబ్జెక్టు లేకుండా మాట్లాడుతున్నారు: చంద్రబాబు