telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

ఒడిశాకు .. ‘ఫణి’ తుఫాను .. హెచ్చరికలు..

yellow warning to odissa on fani cyclone

భారత వాతావరణశాఖ అధికారులు ఫణి తుపాన్ విపత్తు నేపథ్యంలో బుధవారం ఒడిశా రాష్ట్రానికి ‘ఎల్లో వార్నింగ్’ జారీ చేశారు. ఒడిశా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. బౌధ్, కలహండీ, సంబాల్ పూర్, దియోఘడ్, సుందర్ ఘడ్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఫణి తుపాన్ ఒడిశా తీరంలోని గోపాల్ పూర్, చాంద్ బలి ప్రాంతాల మధ్య తీరం దాటవచ్చిన కేంద్ర హోంశాఖ ఆధీనంలోని విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. ఫణి తుపాన్ వల్ల దక్షిణ పూరి ప్రాంతంలో మే 3వతేదీన గంటకు 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. గంజాం, పూరి, జగత్ సింగ్ పూర్, కేంద్రాపారా జిల్లాల్లో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలివీచే అవకాశం ఉంది.

గజపతి, ఖుర్దా, కటక్, జైపూర్, భాద్రక్, బాలాసోర్ జిల్లాలో 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. నయాఘడ్, అంగూల్, కియోంజర్, మయూర్ భంజ్, దేన్ కనాల్ జిల్లాల్లో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అధికారులు హెచ్చరించారు. ఫణి తుపాన్ వల్ల ఒడిశా తీరంలో సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు మే 2 నుంచి 4వతేదీ వరకు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

ఈ తుపాన్ వల్ల కచ్చా ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, రైలు పట్టాలు, రోడ్లు, పంటలు, పండ్లతోటలు దెబ్బతినవచ్చని అధికారులు హెచ్చరించారు. ఒడిశా తీర ప్రాంతంలో రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను ముందు జాగ్రత్తగా నిలిపివేశామని అధికారులు ప్రకటించారు.

Related posts