telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈసీని నిందించడం సరికాదు.. చంద్రబాబుకు పురందేశ్వరి హితవు

ఏపీ లో మొన్న జరిగిన పోలింగ్ లో ఈవీఎంలు మొరాయించడం, వీవీ ప్యాట్లలో లోపాలుండడం పై సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల విషయంలో జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టి పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఆయనపై ప్రత్యర్థులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి కూడా బాబు అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. ఎన్నికలు, పోలింగ్ అంశాలకు సంబంధించి ఈసీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని హితవు పలికారు.

ఓటమి భయంతో ఇతరులను విమర్శించడం సాధారణమైన విషయం అని అన్నారు. ధైర్యం ఉంటే ఫలితాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించాలని సూచించారు. ఓటమి భయంతో ఉన్నవాళ్లే ఇలాంటి విషయాల ఆరోపణలు చేస్తుంటారని పురందేశ్వరి దుయ్యబట్టారు. ధైర్యం ఉంటే ఫలితాన్ని హుందాగా అంగీకరించాలని పేర్కొన్నారు.

Related posts