telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రేపు తెలంగాణ కు రానున్న కేంద్ర బృందం

ganga river with dangerous flow with floods

గత వారం రోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి… గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతినగా… హైదరాబాద్‌లో అపారనష్టం జరిగింది.. ఇప్పటికీ పలు కాలనీలు ఇంకా వర్షంనీటిలోనే ఉండగా.. మళ్లీ మళ్లీ వర్షం కురుస్తూనే ఉండడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పర్యటించనుంది కేంద్ర బృందం.. రేపు సాయంత్రం హైదరాబాద్‌కు రానున్న కేంద్ర బృందం… రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.. నష్టం తీవ్రతను అంచనా వేయనుంది సెంట్రల్ టీమ్.. ఈ 13వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో 5 వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం.. తక్షణ సహాయంగా రూ. 1350 కోట్లను విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఈ నేపథ్యంలోనే కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుంది.

Related posts