ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. ప్రధాని వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణీకులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. 11 మంది చిన్నారులు, ఇద్దరు శిశువులు ఉన్నారు.
కాగా వైద్య కళాశాల భవనంపై విమానం పడిపోవడంతో అందులో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వారు సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.