telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ప్రియాంక హత్య కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్

ప్రియాంకరెడ్డి హత్యకేసులో నలుగురు నిందితులకు మేజిస్ట్రేట్ పాండునాయక్ 14 రోజుల రిమాండ్ విధించారు. షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో తహసీల్దారు పాండు నాయక్ ఎదుట ప్రియాంకరెడ్డి హత్యకేసు నిందితులను పోలీసులు హాజరుపరిచారు. పీఎస్‌లోనే మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నిందితులను విచారించారు.

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, నిందితులను బయటకు తీసుకురావడం సురక్షితం కాదని పోలీసులు భావించారు. దీంతో పోలీసులు మేజిస్ట్రేట్ ను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కే తీసుకొచ్చారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో నిందితులను మహబూబ్ నగర్ జిల్లా జైలుకు పోలీసులు తరలించనున్నారు.

Related posts