telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నిజామాబాద్ లో నకిలీ బాబా అరెస్ట్…

నిజామాబాద్ లో ఓ చిన్న పత్రికను నడిపిస్తూ దాని ముసుగులో అక్కడికి వచ్చిన మహిళలకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు ఓ నకిలీ బాబా. అయితే శివ ప్రసాద్ అనే వ్యక్తి తన వ్యాపారం దివాళా తీయడంతో ఈజీ మనీ కోసం బాబా అవతారం ఎత్తి ఈ దారుణాలకు పాల్పడ్డాడు. రోగంతో వచ్చిన  మహిళలను లోబరుచుకొని కామవాంఛ తీర్చుకోవడం ప్రారంభించాడు. అయితే చేసే మోసం ఎక్కువ కాలం నిలవదు కదా… కొన్ని నెలల క్రితం అక్కడ స్థానికంగా ఉండే దంపతులు తమ 15 ఏళ్ళ కూతురుకు ఆరోగ్యం సరిగ్గా లేదు అని ఈ నకిలీ బాబా వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు తలిదండ్రులను బయటకు పంపి ఆ బాలికకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పలుమార్లు బాలికను బెదిరించి అత్యాచారం చేసాడు. కానీ ఇటీవల బాలికకు కడుపు నొప్పి రావడంతో తలిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అసలు విషయం బయటపడింది.ఇక విషయం తెలుసుకున్న స్థానికులు ఆ బాబా ఆఫీస్ పై దాడి చేసారు. బట్టలు చిరిగేలా చితకొట్టారు, చివరకు పోలీసులు రావడంతో స్థానికుల నుండి బయటపడ్డాడు . వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

Related posts