telugu navyamedia
క్రీడలు తెలంగాణ వార్తలు వార్తలు

జిహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంప్ వాలీబాల్ శిక్షణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు

జిహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో భాగంగా ఆరు జోన్లలో  915 సెంటర్లలో 44 క్రీడా విభాగాల్లో  విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.  ఖైరతాబాద్ జోన్ విక్టరీ ప్లే గ్రౌండ్, ఖైరతాబాద్ వార్డు ఆఫీస్, రహీంపుర ప్లే గ్రౌండ్, షేక్ పేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లలో నిర్వహిస్తున్న వాలీబాల్ శిక్షణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
జిహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో భాగంగా మే 15 నుండి 19 వరకు ఇంటర్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ సెంటర్ టోర్నమెంట్ ను ఐదు రోజుల పాటు 16 గేమ్స్ ద్వారా నిర్వహిస్తుంది. ఇంటర్ టోర్నమెంట్ లో బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్,  చెస్, క్యారమ్స్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డీ, రోలార్ స్కేటింగ్, శపక్ తక్రా, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టెన్నీ కైట్, వాలీబాల్ లో నిర్వహిస్తారు.

నగర వ్యాప్తంగా జిహెచ్ఎంసి 2023 సంవత్సరంలో 6 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల పిల్లలకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ లను 37 రోజుల పాటు  ఉదయం 6:15 గంటల నుండి 8:15 గంటల వరకు 77 పార్ట్ టైం కోచ్ లు, 712 హానరేరియం కోచ్ ల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు జిహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో షటిల్ బ్యాడ్మింటన్, రోలర్ స్కేటింగ్, క్రికెట్, టెన్నిస్ రూపాయలు 50/- మిగతా గేమ్స్ కు పది రూపాయలు చెల్లించి శిక్షణ పొందవచ్చును.

Related posts