*ముగిసిన మంత్రి కేటీఆర్ తో వీఆర్ఏ సంఘం భేటి
*మంత్రి కేటీఆర్ విజ్ఞప్తితో సమ్మె తాత్కలికంగా వాయిదా
*రేపటి నుంచి ఈ నెల 20 వరకు శాంతియుత నిరసనలు
వీఆర్ఏ సంఘ నాయకులతో మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో సమావేశమయ్యారు.అయితే ప్రభుత్వంతో మీటింగ్ తరువాత సమ్మె తాత్కాలిక వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.
వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని వీఆర్ఏలకు హామీ ఇచ్చారు. వీఆర్ఏల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు జరుగుతున్న సమయంలో వీఆర్ఏలు ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఆందోళనలు విరమించి విధుల్లో జాయిన్ కావాలని కేటీఆర్ కోరారు. 17వ తేదీన జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు ముగిసిన అనంతరం 18వ తేదీ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీఆర్ఏ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తారని కేటీఆర్ హామీ ఇచ్చారు.
తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు వీఆర్ఏ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారన్నారు.
మంత్రి కేటీఆర్ పై తమకు నమ్మకం ఉందని, మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్ విజ్ఞప్తితో సమ్మె తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ నెల 20 వరకు శాంతియుత నిరసనలు తెలుపుతామన్నారు.
అవకాశమిస్తే..మోదీ తెలంగాణను అమ్మేస్తాడు..