telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

అర్హులైన అందిరికి ఆ పథకం వర్తింపజేస్తాం : మంత్రి సబితా

తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో పని చేస్తున్న భోదన మరియు బోధనేతర సిబ్బందికి నెలకు 2 వేల రూపాయలు మరియు 25 కిలోల బియ్యం తిరిగి పాఠశాలలు తెరిచే వరకు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

ఇందుకు గాను 16 మార్చి 2020 నాటి స్టాఫ్ అటెండన్స్ రిజిష్టర్స్ ప్రమాణంగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అయితే కేవలం UDISE ప్రకారం ఉన్న లక్షన్నర సిబ్బందికి మాత్రమే ఈ చెల్లింపులు జరుగుతాయి అన్న ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో TRSMA రాష్ట్ర ప్రతినిధి వర్గం రాష్ట్ర విద్యా శాఖామాత్యులు శ్రీమితి సబితా ఇంద్రా రెడ్డి గారిని నేటి మధ్యహ్నం వారి (SCERT Bhawan)ఛాంబర్ లో కలసి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది . ప్రధానంగా UDISE లో ఇంకా నమోదు కాని ప్రీప్రైమరీ మరియు ఇతర ఉపధ్యాయులను, బోధనేతర సిబ్బందిని కలుపుకొని ఈ పథకాన్ని వర్తింపజేయాలని వారిని అభ్యర్దించడం జరిగింది . ఇందుకు సానుకూలంగా స్పందించిన విద్యా శాఖ మంత్రి , అర్హులైన అందిరికి ఈ పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు . ఐతే అర్హతను నిర్దారించేందుకై ఏర్పాటు చేయబడ్డ వెరిఫికేషన్ టీం లకు సహకరించవలసింది గా ఆమె కోరారు .16 మర్చి 2020 నాటి స్టాఫ్ అటెండన్స్ రిజిస్టర్ ను వెరిఫై చేయడానికి తప్పక సహకరిస్తామని trsma రాష్ట్ర కార్యవర్గం తెలిపింది.

10 వ తరగతి పరీక్షలు కరోనా 2 వ వేవ్ కారణంగా రద్దు చేయబడ్డాయి , ఐతే పాఠశాలల ప్రధాన ఉపాద్యాలు 10 వ తరగతి పిల్లల fa1 మార్కులను నేటి సాయంకాలం 5 గంటల లోపు అప్లోడ్ చేయవలసిందిగా ఆ యా జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఇంత తక్కువ గడువు లో ఆ పని పూర్తి కాదని ఇందుకు మరి కొంత సమయం కావాలని trsma రాష్ట్ర నాయకత్యం మంత్రి గారిని కోరడం జరిగింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి గారు ఈ నెల 26 వ తేదీ వరకు అవకాశం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు .

గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాలకు,సిబ్బందికి ఏర్పడిన భయాలను తక్షణమే తొలగించేందుకు చొరవ చూపెట్టిన విద్యా శాఖామంత్రికి trsma రాష్ట్ర ప్రతినిధివర్గం కృతఙ్ఞతలు తెలిపింది.

Related posts