ఈ టూర్ కు సంబంధించి ప్రధాని కార్యాలయం ఏపీ అధికారులకు సమాచారం అందించింది.
ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ చేరుకుంటారని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధానికి స్వాగతం పలుకుతారని అధికారులు తెలిపారు.
ఎయిర్ పోర్ట్ నుంచి ప్రధానితో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఏయూ చేరుకుంటారని వివరించారు. అక్కడి నుంచే ప్రధాని మోదీ ఏపీలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని సమాచారం.
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రైల్వేజోన్ పరిపాలన భవనాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు.
అనంతరం జరిగే బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో కలిసి మోదీ పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొంటారు.
అధికారులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.

