telugu navyamedia
pm modi నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

కేరళలోని వాయనాడ్ లో విరిగిపడిన కొండచరియలు ఘటనపై నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

శిధిలాల మధ్య చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

“వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడి ఘటన తీవ్రంగా కలిచివేసింది. తమ ప్రియమైనవారిని కోల్పోయిన వారందరికీ, అలాగే గాయపడినవారి కోసం నా ప్రార్ధనలు’ అని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు”.

శిధిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడంలో భాగంగా రెస్క్యూ ఆపరేషన్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్తో ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరా తీసి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై కూడా భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ.

కేంద్రం తరపున చనిపోయినవారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు ప్రధాని మోదీ.

Related posts